జపాన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ కార్పొరేషన్ త్వరలో ఫార్ములు వన్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది. బహుశా వచ్చే ఏడాది తర్వాత తాము ఈ చారిత్రాక ఎఫ్1 రేసుల నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే అనేక అత్యున్నత స్థాయి సంస్థలు ఎఫ్1 నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో.. వాటి కోవలోకి తాజాగా బ్రిడ్జ్‌స్టోన్ కూడా చేరనుంది.
ఎఫ్ఐఏకు అధికారికంగా టైర్లను సరఫరా చేసే కాంట్రాక్టు ముగియనున్నట్లు బ్రిడ్జ్‌స్టోన్ తెలిపింది. 2006లో ఫ్రెంచ్ పోటీదారు మిచెలిన్ మరియు 1998లో అమెరికాకు చెందిన గుడ్ఇయర్ సంస్థలు వైదొలగిన అనంతరం ఎఫ్ఐఏతో బ్రిడ్జ్‌స్టోన్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. బ్రిడ్జ్‌స్టోన్ తర్వాత ఎవరు రానున్నారనే విషయంపై ప్రశ్నించినపుడు.. కాంట్రాక్టు ముగియనున్న విషయాన్ని వెల్లడించింది.
ఎఫ్ఐఏ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌తో కొత్తగా టైర్ల సరఫరా కాంట్రాక్టు ఏదీ కుదర్చుకోలేదని బ్రిడ్జ్‌స్టోన్ వివరించింది. బ్రిడ్జ్‌స్టోన్ తన ప్రకటనలో ఈ విషయాలను తెలిపింది. కాగా, బ్రిడ్జ్‌స్టోన్ వైదొలగుతుండటంతో.. జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహిస్తున్న టయోటా మోటర్ సంస్థ కూడా వైదొలిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే.. ఆర్థిక మాంద్యం కారణంగా.. హాండా కంపోనీ ఇప్పటికే.. తన జట్టును విక్రయించేసింది.