ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా ఇండోర్ గేమ్స్ : ఫైనల్లో ముగ్గురు భారత బాక్సర్లు (Sports I News I Asia Indore Games I Finals I Indian Boxer's I Nagisetti Usha I Mericam I Saritha Devi)
ఆసియా ఇండోర్ గేమ్స్ : ఫైనల్లో ముగ్గురు భారత బాక్సర్లు
FILE
ఆసియా ఇండోర్ గేమ్స్ మహిళల బాక్సింగ్‌లో ముగ్గురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. 57 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నగిశెట్టి ఉష.. 46 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ మేరీకామ్, 54 కేజీల విభాగంలో "అర్జున అవార్డు" గ్రహీత సరితాదేవి ఫైనల్లోకి ప్రవేశించారు.
సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో ఉష 3-2 స్కోరుతో.. వియత్నాంకు చెందిన చుంగ్ ఎన్‌గో థిపై విజయం సాధించింది. మేరీకామ్ 7-3 స్కోరు ఫిలిఫ్పీన్స్‌కు చెందిన జోసీ గబుకోను ఓడించగా... సరితాదేవి 25-3 స్కోరు తేడాతో వియత్నాంకు చెందిన లీన్ దొవాన్‌ను మట్టిగరిపించి విజయం కైవసం చేసుకుంది.
కాగా.. బుధవారం జరిగే ఫైనల్స్‌లో వియత్నాంకు చెందిన హోవా ఎన్‌గుయి థితో మేరీకామ్.. చైనాకు చెందిన కిన్ జాంగ్‌తో సరితాదేవి.. థాయ్‌లాండ్‌కు చెందిన పీమ్ విలయ్ లావోపీమ్‌తో ఉష తలపడనున్నారు. ఇదిలా ఉంటే.. చుంగ్ ఎన్‌గో థితో జరిగిన బౌట్‌లో ఉష చివరి రౌండ్‌లో అద్భుతమైన పోరాట పటిమను కనబర్చి విజయాన్ని ఖాయం చేసుకోవటం విశేషంగా చెప్పవచ్చు.