వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సోనీ ఎరిక్సన్ టోర్నీలో సెరెనాకే టైటిల్ (Sports I News I Sony Ericsson ChampionShip Torni I Finals I Serena Williams I Venus Williams I)
Feedback Print Bookmark and Share
 
Serena williams
FILE
ఈ సంవత్సరం చివరిదైన "సోనీ ఎరిక్సన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ" ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్ 6-2, 7-6(4) స్కోరు తేడాతో తన సోదరి వీనస్ విలియమ్స్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. తొలి సెట్ సునాయాసంగా గెలిచిన సెరెనాకు.. రెండో సెట్‌లో వీనస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాంతో ట్రై‌బ్రేకర్‌కు దారితీసింది. అయినప్పటికీ సెరెనా 7-4 స్కోరుతో గెలిచి సెట్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో సెరెనా ఖాతాలోకి 1.55 మిలియన్ డాలర్ల ఫ్రైజ్‌మనీ చేరింది.

కాగా.. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పోరులో మరోసారి చెల్లెలిదే పైచేయి అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఏడాదిలోనే చెల్లెలి చేతిలో వీనస్ భంగపడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇదే టోర్నీలో రౌండ్ రాబిన్ లీగ్‌లో అక్క వీనస్‌పై విజయం సాధించిన సెరెనా విలియమ్స్.. అంతకుమునుపు మియామీ టోర్నీలోనూ.. వింబుల్డన్ ఫైనల్స్‌లోనూ గెలుపొందింది.

ఈ సందర్భంగా సెరెనా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001 సంవత్సరం తరువాత ఈ టోర్నీ గెలవడం ఇదే తొలిసారనీ... అక్కపై గెలవటం అంత సులువైన పని కాదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే... ఈ టైటిల్‌ను సాధించినప్పటికీ, డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో మాత్రం సెరెనా రెండో స్థానానికే పరిమితం అయ్యింది. తాజా ర్యాంకింగ్స్‌లో రష్యాకు చెందిన దినారా సఫీనా 7731 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... 7576 పాయింట్లతో సెరెనా తృటిలో నెంబర్‌వన్ ర్యాంకును చేజార్చుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.