ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బాస్కెట్‌బాల్ టోర్నీలో "ఫ్యూచర్ కిడ్స్" విజయం (Sports I News I Open Basket Ball Tourney I Future Kids I Victory Playground I Hyderabad Under-19 I Goals)
జీహెచ్‌ఎంసీ వార్షిక ఓపెన్ బాస్కెట్ బాల్ టోర్నీ మహిళల విభాగంలో "ఫ్యూచర్ కిడ్స్" విజయం సాధించింది. విక్టరీ ప్లే గ్రౌండ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 17-15 స్కోరుతో హైదరాబాద్ అండర్-19 జట్టుపై గెలుపొందింది. కాగా.. ఫ్యూచర్ కిడ్స్ జట్టులో ఐశ్వర్య ఎనిమిది.. హైదరాబాద్ జట్టులో హేమలత పది గోల్స్ సాధించారు.
మరో మ్యాచ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ-ఎ జట్టు 25-5 స్కోరు తేడాతో గురు స్కూల్ జట్టును ఓడించింది. భవ్య 14, శ్యామల 8 గోల్స్ సాధించి ఉస్మానియా విజయంలో కీలకపాత్ర పోషించారు. కాగా.. గురు జట్టులో నేహా సాధించిన 5 గోల్స్ జట్టును అపజయం నుంచి కాపాడలేకపోయాయి.
ఇక పురుషుల విభాగంలో నిజాం బాస్కెట్‌బాల్ అకాడమీ 58-46 స్కోరుతో ఎంసీ ఈఎంఈ జట్టుపై విజయం సాధించింది. అలాగే... బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ 45-36 స్కోరుతో జింఖానా క్లబ్ జట్టుపై.. డెక్కన్ క్రానికల్ జట్టు 77-45 స్కోరుతో విక్టరీ ప్లేగ్రౌండ్ జట్టుపై.. ఏపీ పోలీస్ జట్టు 43-25 స్కోరుతో జీహెచ్ఐసీ జట్టుపై గెలుపొందాయి.