ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » టాప్-100 లక్ష్యంగా దూసుకెళ్తోన్న సోమ్‌దేవ్ (Sports, News | Somdev Devvarman | ATP | Mahesh Bhupathi | Leander Paes | Sania Mirza | Prakash)
భారత నెంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ టాప్-100 ర్యాంకు లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. తాజా ఏటీపీ ర్యాంకుల్లో ఇతను 5 స్థానాల్ని మెరుగుపర్చుకుని 121 ర్యాంకు నుంచి 116వ ర్యాంకుకు ఎగబాకాడు. కొరియాలో జరిగిన ఏటీపీ ఛాలెంజర్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరటం ద్వారా సోమ్‌దేవ్ 480 పాయింట్లను తన ఖాతాలో జమచేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ప్రముఖ హైదరాబాదీ స్టార్ సానియామీర్జా తన 58వ ర్యాంకులో ఏ మార్పూ లేకుండా కొనసాగుతోంది. కానీ డబుల్స్‌లో రెండు స్థానాలను చేజార్చుకున్న సానియా ప్రస్తుతం 38వ ర్యాంకులో నిలిచింది.
అలాగే పురుషుల డబుల్స్‌లో మహేశ్ భూపతి ఏడవ స్థానంలోనూ.. లియాండర్ పేస్ ఎనిమిదవ స్థానంలోనూ ఎలాంటి మార్పూలేదు. ప్రకాష్ అమృతరాజ్ 7 స్థానాల్ని మెరుగు పరచుకుని 223వ ర్యాంకులో నిలవగా... యూకీ భాంబ్రీ తన 344వ ర్యాంకును అలాగే నిలబెట్టుకున్నాడు.