వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » "స్క్వాష్ ఓపెన్ టోర్నీ" రెండో రౌండ్లోకి సౌరవ్ (Sports | News | Squash | Sourav Ghosh | Squash Open Tourney | Second Round | Kuwait | China |)
Feedback Print Bookmark and Share
 
sports
FILE
భారత నెంబర్‌వన్ స్క్వాష్ ఆటగాడు సౌరవ్ గోషల్.. ప్రపంచ స్క్వాష్ ఓపెన్ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌కి చేరుకున్నాడు. కువైట్‌లో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్‌లో సౌరవ్ 0-11, 11-6, 11-8, 11-5 స్కోరు తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన కాస్టాగ్‌నెట్‌పై విజయం సాధించాడు.

తొలిగేమ్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేని సౌరవ్.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుని ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. వరుసగా మూడు గేమ్‌లతో మ్యాచ్ నెగ్గి ప్రత్యర్థికి చెక్ పెట్టేశాడు. కాగా.. రెండో రౌండ్‌లో గోషల్ చైనాకు చెందిన 29వ సీడ్‌తో తలపడనున్నాడు.

ఇదిలా ఉంటే.. 24 దేశాల నుంచి మేటి ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ స్క్వాష్ ఓపెన్ టోర్నీలో అత్యధిక ఫ్రైజ్‌మనీ రూ. కోటీ 30 లక్షలు కావటం గమనార్హం. విజయానంతరం గోషల్ మాట్లాడుతూ... ఈ రౌండ్ గెలవటం చాలా కష్టమైందనీ, అయితే మెరుగైన ఆటతీరును ప్రదర్శించి మ్యాచ్ నెగ్గటంతో చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.