ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బాస్తియా చెస్ టోర్నీ : సిరీస్ ఆనంద్ కైవసం (Sports | News | Bastia Chess Champions Tourney | Russia | Former World Champion Anatoly Karpov |)
బాస్తియా చెస్ ఛాంపియన్స్ టోర్నీలో రష్యాకు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ అనటోలీ కార్పోవ్‌పై ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఘన విజయం సాధించాడు. దీంతో నాలుగు గేమ్‌ల సిరీస్‌ను 3.5-0.5 స్కోరు తేడాతో ఆనంద్ కైవసం చేసుకున్నాడు.
రాపిడ్ చెస్ మ్యాచ్ తొలి గేమ్‌లో గెలుపొంది 1.5-0.5 స్కోరు ఆధిక్యంలో నిలిచిన ఆనంద్.. రెండో గేమ్‌లో నల్లపావులతో ప్రత్యర్థిపై విరుచుకుపడి తేలికగా డ్రా చేసుకున్నాడు. ఇక మిగిలిన రెండు గేముల్లోనూ కార్పోవ్‌తో తలపడిన ఆనంద్... వరుసగా రెండింట్లోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే... 2009 ఆగస్టు నెలలో జర్మనీలో జరిగిన మైంజ్ క్లాస్ చెస్ టైటిల్ టోర్నీలో పరాజయం అనంతరం ఆనంద్ పాల్గొన్న మొదటి టోర్నీ బాస్తియా టోర్నీ కావడం విశేషం. ఈ టోర్నీ తరువాత మాస్కోలో జరుగనున్న "తాల్ మెమోరియల్ టోర్నీ".. వచ్చే సంవత్సరం జనవరి నెలలో జరిగే "కోరస్ చెస్ టోర్నీ" మరియు "వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్ టోర్నీ"లలో.. వరుసగా పాల్గోనున్నాడు.