ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఐపీఎల్ తరహాలో కేరళ వాలీబాల్ లీగ్.. త్వరలో! (Kerala Volleyball League | IPL | Mammootty | Kerala Volleyball Association)
క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంత భారీ విజయాన్ని సాధించిందే వేరే చెప్పక్కర్లేదు. ఇప్పడు.. ఐపీఎల్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. ఓ వాలీబాల్ లీగ్‌ను కూడా ప్రవేశపెట్టాలని దక్షిణభారత రాష్ట్రం కేరళ ప్రణాళిక చేస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ తరహాలో.. కేరళ వాలీబాల్ లీగ్ (కేవీఎల్) కోసం.. ఫ్రాంఛైజీలకు బిడ్ కోసం.. అంటే త్వరలో ఆటగాళ్లకు సంబంధించిన వేలం కోసం ఆహ్వానాలను పంపనున్నారు. కేరళ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ (కేవీఏ) ఈ వివరాలను వెల్లడించింది. దక్షిణాది చిత్రాల్లో ప్రముఖ నటుడిగా వెలుగొందుతున్న మమ్ముట్టీ.. ఈ కేవీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గాను అలాగే.. ప్రమోటర్‌గాను ఉంటారని తెలిపింది.
కేవీఏ అందించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు కోజీకోడ్‌లో తొలి ఐపీఎల్ తరహా.. కేవీఎల్‌ను నిర్వహించనున్నారు. విలేకరులతో మమ్ముట్టీ మాట్లాడుతూ, తప్పకుండా.. కేవీఎల్ మరో అద్భుత విజయం అవుతందన్నారు. వాలీబాల్‌ను దేశంలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ఈ ఐపీఎల్ తరహా కేవీఎల్ ఎంతగానో తోడ్పడగలదని మమ్ముట్టీ తెలిపారు.