ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కొరియా ఛాలెంజర్: ప్రకాశ్ సింగిల్స్‌లో ఓకే.. డబుల్స్‌లో ఔట్ (Prakash Amritaraj | Korea Challenger Open tennis tourny | singles | doubles)
కొరియా ఛాలెంజర్: ప్రకాశ్ సింగిల్స్‌లో ఓకే.. డబుల్స్‌లో ఔట్
కొరియా ఓపెన్ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చెందిన టెన్నిస్ యువకెరటం ప్రకాశ్ అమృతరాజ్.. ముందంజ వేశాడు. అయితే ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో మాత్రం ప్రారంభ రౌండు నుంచే వైదలిగాడు. సింగిల్స్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ప్రకాశ్.. ఐదో సీడ్ ఆటగాడు మరియు స్థానిక ఫేవరేట్ క్యు తాయ్ ఇమ్‌పై సంచలన విజయం నమోదు చేశాడు.
ఈ టోర్నీ రెండో తొలి రౌండులో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో క్యూ తాయ్‌పై 7-6 (2), 6-2తో ప్రకాశ్ గెలుపొందాడు. తన తర్వాతి మ్యాచ్‌లో ప్రకాశ్.. లాత్వియాకు చెందిన ఆండిస్ జస్కాతో తలపడనున్నాడు. అంతకుముందు.. తన తొలిరౌండులో ఆండిస్.. కొరియాకు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాంగ్ వూ నాపై 6-2, 6-3తో విజయం సాధించాడు.
సింగిల్స్‌లో సత్తా చాటిన ప్రకాశ్ డబుల్స్‌లో మాత్రం.. నిరుత్సాహపరిచాడు. అమెరికా భాగస్వామి.. అలెక్స్ కుజ్‌నెత్సోవ్‌తో కలిసి ప్రకాశ్ బరిలోకి దిగాడు. దక్షిణాఫ్రికా, డేన్‌లకు చెందిన రెండో సీడ్ జోడీ.. రిక్ డీ వొయెస్ట్, ఫ్రెడరిక్ నీల్సన్‌ల చేతిలో 3-6, 4-6తో ప్రకాశ్, కుజ్‌నెత్సోవ్‌లు ఓటమి పాలయ్యారు.