వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వొవినామ్ ఆసియా ఇండోర్ గేమ్స్: భారత్‌కు ఏడు పతకాలు (Vovinam asia Indoor games | India | Pratiksha | Santosh Shinde)
Feedback Print Bookmark and Share
 
వియత్నాంలోని హనోయ్ వద్ద ఆసియా ఇండోర్ క్రీడల్లో భాగంగా జరిగిన వొవినామ్ పోటీల్లో భారత్ ఏడు పతకాలను సాధించింది. యుద్ధ కళా క్రీడగా వియత్నంలో నిర్వహించే ఈ పోటీలు అత్యంత ప్రత్యేకమైనవి. భారత్‌కు చెందిన ఏడుగురు మంది.. వొవినామ్ జట్టు.. ఒక పసిడి, మూడు రజతం, మూడు కాంస్య పతకాలను నెగ్గింది.

మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రతిక్ష సంతోష్ షిండే.. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో ఒక పసిడి.. మూడు రజత పతకాలను గెలుచుకుంది. సింగిల్స్ కేటగిరీలో.. భారత జట్టు తరపున పసిడి పతకం నెగ్గిన ఒకే ఒక క్రీడాకారిణి ప్రతిక్ష. అలాగే ఇదే టోర్నీ మల్టిపుల్ అటాక్ టెక్నిక్‌లో ప్రతిక్ష, రాహుల్ కుమార్, శశాంక్, కథాడే, దేవ్రో శంకర్‌రావ్ కప్సే తదితరులు రజత పతకాన్ని గెలుచుకున్నారు.

ఇక మిగిలిన మూడు కాంస్య పతకాలు.. మణిపూర్ నుంచి వచ్చిన చొంగ్తామ్ మహదేవ సింగ్, దేవన్ మొయ్‌రంగ్తెమ్‌లు గెలుచుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.