వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బీచ్ వాలీబాల్ ట్రోఫీ టీసీఎస్ ఈ సర్వ్ సొంతం (Grand Finale | Radission Temple Bay | Beach | Volley Ball | Sports)
Feedback Print Bookmark and Share
 
Srini
WD
రాష్ట్ర రాజధాని చెన్నయ్‌ శివారు ప్రాంతమైన మహాబలిపురం సముద్ర తీరంలో ఉన్న ది రాడిసన్ టెంపుల్ బే నక్షత్ర హోటల్‌ ప్రాంగణంలో బీచ్ వాలీబాల్ పోటీలు జరిగాయి. ఇందులో నగరంలోని పలు కార్పొరేట్ కంపెనీలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. నగరంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు చెందిన జట్ల మధ్య క్రీడామక్కువను చాటేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు.

ఈ టోర్నమెంట్‌లో ఇన్ఫోసిస్, కాంగిజెంట్, ఐ సాఫ్ట్, హెక్సావేర్ టెక్నాలజీస్, కొల్లాబ్‌నెట్, అమాజాన్ డాట్ కామ్, రాయల్ సుందరం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, థాంమ్సన్ రాయచర్స్, జీఅర్ ఫ్రాగ్‌నెస్, డోర్మా, జోహోకార్ప్, సీఎస్‌సీ, అవీవా, కాలిబర్ పాయింట్, లార్సన్ అండ్ టర్బో, హెంకల్ ఇండియా, హిందుజా గ్లోబల్ సొల్యూషన్ తదితర కార్పొరేట్ కంపెనీల జట్లు ఇందులో పాల్గొన్నాయి.

క్వార్టర్ ఫైనల్‌లో టీసీఎస్ ఈ సర్వ్, ఇన్ఫోసిస్, సీఎస్సీ, జోహోకార్ప్, కాంగిజెంట్, ఐ సాఫ్ట్, అమోజాన్ డాట్ కామ్, డోర్మా జట్లు తలపడ్డాయి. ఈనెల ఒకటో తేదీన జరిగిన గ్రాండ్ ఫైనల్ పోటీలో టీసీఎస్ ఈ సర్వ్, కాంగిజెంట్ టెక్నాలజీ జట్లు తలపడ్డాయి. కాంగిజెంట్ కార్పొరేట్‌ జట్టును 21-17, 15-21, 21-7 స్కోరుతో ఓడించిన టీసీఎస్ ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.