ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బాక్సింగ్: మేరీ కామ్, కవితలకు పసిడి పతకాలు (Mary Com | Kavita | Boxing | Asia Indoor Games | Gold medal)
నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత టాప్ బాక్సర్ ఎంసీ మేరీ కామ్, ఆసియా ఇండోర్ గేమ్స్ మహిళల బాక్సింగ్‌లో తన సత్తా చాటింది. మేరీ కామ్ రాణింపుతో మహిళల విభాగంలో 46 కేజీల కేటగిరీలో, రెండు పసిడి పతకాలు, అనేక రజత పతకాలు భారత్‌కు దక్కాయి.
వియత్నాంకు చెందిన ప్రముఖ బాక్సర్ హోవా ఎన్‌గుయెన్‌పై మేరీ కామ్ గెలుపొందింది. తొలి రౌండు నుంచే మేరీ కామ్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఆరంభంలో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు సాగింది. దీంతో ఇరువురికి సమాన స్కోరు వచ్చింది. కానీ, మేరీకామ్ తనకున్న అపార అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని హూవాపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
అలాగే మరో మ్యాచ్‌లో 64 కేజీల విభాగంలో కవితా గోయత్.. భారత్‌కు మరో పసిడిని సాధించి పెట్టింది. ఇంకా 54 కేజీల విభాగంలో సరితా దేవీ, 57 కేజీల విభాగంలో ఎన్ ఉషలు ఒక్కో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.