ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కొరియా ఛాలెంజర్: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ప్రకాశ్ (Prakash Amritaraj | Korea Challenger Open tennis tourny | Andis Juska)
కొరియా ఛాలెంజర్: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ప్రకాశ్
కొరియా ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు ప్రకాశ్ అమృతరాజ్ సత్తా చాటుతున్నాడు. ఈ టోర్నీ రెండో రౌండులో.. లాట్వియాకు చెందిన ఆండిస్ జుస్కాపై 6-1, 2-6, 7-6తో ప్రకాశ్ గెలుపొందాడు. దీంతో క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.
ఈ టోర్నీలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ప్రకాశ్.. ఆండిస్‌తో అత్యంత చాకచక్యంగా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ తొలి సెట్లో ప్రకాశ్‌పై ఆండిస్ పై చేయి సాధించగలిగాడు. కానీ మిగిలిన రెండు సెట్లలో తొలి సెట్ తరహాలో ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ప్రకాశ్ చేతిలో ఆండిస్ ఓటమి చవిచూడక తప్పలేదు.
క్వార్టర్స్‌లో ప్రకాశ్.. డచ్‌కు చెందిన ఇగోయ్ సిజ్లింగ్‌తో తలపడనున్నాడు. అంతకుముందు రెండో రౌండులో సిజ్లింగ్, మూడో సీడ్ లూకాస్ లాకోపై గెలుపొందాడు. మరోవైపు.. ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన పురవ్ రాజా, సాదిక్ ఖాదిర్‌లు సెమీస్‌లోకి ప్రవేశించారు.