ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా కప్ హాకీ: కొనసాగుతున్న భారత జోరు (Asia Cup | Womens hockey | India | China | Malaysia | South Korea)
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో భారత వేగంగా ముందుకు వెళుతోంది. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌ను 1-1తో భారత్ డ్రాగా ముగించింది. దీంతో గ్రూప్- ఏలో జరిగిన ఈ చివరి మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
27వ నిమిషంలో.. డిఫెండర్ బింటా టోపో భారత్‌కు చక్కటి స్కోరును అందించగా.. నాలుగో నిమిషంలో జులియాని మహమ్మద్ డిన్ మలేషియా తరపున గోల్ చేసింది. ఏదేమైనప్పిటీక.. భారత్ ఏ గ్రూపులో.. రెండు మ్యాచుల్లో విజయం, రెండు మ్యాచ్‌ల్లో డ్రాతో రెండో స్థానంలో నిలువగా... చైనా అగ్రస్థానంలో ఉంది.
ఇక తన తర్వాతి మ్యాచ్‌లో భారత్ గ్రూప్ బీలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణ కొరియాతో భారత తలపడనుంది. ఇప్పటికే.. చైనా వంటి టాప్ జట్టుపై 15-0తో దక్షిణ కొరియా గెలుపొందింది. దీంతో భారత్.. సెమీస్‌లో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది.