వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » భారీ అంచనాలు, మాపై ప్రభావం చూపుతాయి: సందీప్ (Sandeep Singh | Hockey | expectations | Indian team | Common Wealth Games | Hockey World Cup)
Feedback Print Bookmark and Share
 
ఇటీవలే కెనడా పర్యటనను భారత హాకీ జట్టు విజయవంతంగా పూర్తి చేసింది. రానున్న మూడు ప్రతిష్టాత్మక టోర్నీల్లో రాణించేందుకు భారత జట్టు తీవ్రంగా శ్రమించిందని.. ఆ శ్రమకు ఫలితమే కెనడా పర్యటనను విజయవంతం చేసినట్లుగా కెప్టెన్ సందీప్ సింగ్ వెల్లడించాడు. అయితే.. భారీ అంచనాలు తమ ఆటపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని.. సూచించాడు.

న్యూఢిల్లీలో సందీప్ విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య కాలంలో హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమమివ్వనుంది. దాని తర్వాత అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు న్యూఢిల్లీలో జరుగనున్నాయి. దీని తర్వాత.. నవంబర్‌లో చైనాలో ఆసియా క్రీడల్లోను పాల్గొనేందుకు భారత జట్టు వెళ్లనున్నట్లు సందీప్ తెలిపాడు.

ఎనిమిది సార్లు ఒలింపిక్ ఛాంపియన్‌లుగా నిలిచిన భారత జట్టు.. ఇదివరకు సరైన ఆటను ప్రదర్శించలేకపోయింది. అయితే.. ప్రస్తుతం ముగిసిన కెనడా పర్యటనను పరిగణలోకి తీసుకుంటే.. భారత జట్టు ప్రదర్శన చాలా వరకు విభిన్నంగా ఉంది. 2010లో జరిగే మూడు ప్రధాన టోర్నీల్లో తాము అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని.. మరింత కఠినంగా శ్రమిస్తామని సందీప్ తెలిపాడు.

అయితే ఈ టోర్నీలకు ముందు... తమపై భారీ అంచనాలు చేయవద్దను తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు వివరించాడు. హాకీ లేదా క్రికెట్ ఏదైనా సరే సొంత గడ్డపై భారత్ గెలవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారని తనకు తెలుసన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.