ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అంతర్జాతీయ ఫుట్‌బాల్ అకాడెమీకి శంకుస్థాపన (International Football Academy | Foundation | Soccer | Fooball | FIFA | Indian Football Federation)
ప్రారంభ దశలో ఉన్న సాకర్ ఆటగాళ్లకు శిక్షణ ఇప్పించాలని లక్ష్యంతో అకాడెమీ ఏర్పాటు చేయాలన్న ఫిఫా డ్రీమ్ ప్రాజెక్ట్- 2కు రంగం సిద్ధమయింది. అంతర్జాతీయ తరహాలో ఏ మాత్రం తీసిపోకుండా.. ప్రాథమిక దశ నుంచి సాకర్ క్రీడలో శిక్షణ ఇప్పించాలనే ధ్యేయంతో.. ఫిపా.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అకాడెమీ పేరిట శంకుస్థాన చేశారు.
ఫిపా నేతృత్వాన అంతర్జాతీయ కోచ్‌లు అకాడెమీలో కర్ణాటక నుంచి మాత్రమే కాకుండా దేశంలోని ప్రారంభ స్థాయి ఫుట్‌బాలర్లకు శిక్షణ ఇస్తారు. బెంగుళూరులో ఈ అకాడెమీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అకాడెమీలో శిక్షణ కాలం రెండేళ్లని.. కేంద్ర మంత్రి మరియు భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు.
ఫెడరేషన్ డీఈ అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా), భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్), కర్ణాటక ఫుట్‌బాల్ అసోసియేషన్ (కేఎస్ఎఫ్ఏ)లు సంయుక్తంగా ఈ అకాడెమీని నిర్వహిస్తాయి. ఈ అకాడెమీలో శిక్షణ కోసం వచ్చే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడతాయి.
కాగా, త్వరలో ఇదే తరహా అకాడెమీని సిక్కిం, అండమాన్‌లలో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ప్రఫుల్ తెలిపారు. క్రికెట్‌లాగే దేశంలో.. ఫుట్‌బాల్ కూడా ప్రాముఖ్యత సంతరించుకునేందుకు అధునాతన సౌకర్యాలు, మౌళికసదుపాయాలు కోసం తాము ప్రయత్నిస్తున్నామన్నారు.