ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » స్విస్ ఇండోర్ టెన్నిస్: సెప్పీపై ఫెదరర్ గెలుపు (Roger Federer | Andreas Seppi | Swiss Indoors Tennis tourny)
స్విస్ ఇండోర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ఇటలీకి చెందిన ఆండ్రియాస్ సెప్పీపై గెలుపొంది ప్రపంచ టాప్ ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఈ టోర్నీ రెండో రౌండులో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో సెప్పీపై 6-3, 6-3తో ఫెదరర్ తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో విజయంతో సెప్పీపై వరుసగా ఫెదరర్ ఆరో విజయాన్ని నమోదు చేశాడు. అలాగే బేసల్‌లో ఫెదరర్‌కిది వరుసగా 17వ మ్యాచ్ విజయం.. ఈ సీజన్‌లో 57వ విజయం కావడం విశేషం. గత మూడు ఎడిషన్‌లలోను ఫెదరర్ విజేతగా నిలిచాడు.
ప్రస్తుతం ఫెదరర్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. గత వారంలో జరిగిన లైయాన్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. కాగా, సెప్పీపై ఆడిన మ్యాచ్‌లో ఎప్పటిలానే ఫెదరర్ రెండు బ్రేక్ పాయింట్లను సాధించాడు.