వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » 2010 కామన్వెల్త్ క్రీడల బడ్జెట్‌ను పెంచిన కేంద్రం (2010 Common Wealth Games | Budget | Cabinet | New Delhi)
Feedback Print Bookmark and Share
 
న్యుఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే 2010 కామన్వెల్త్ క్రీడల బడ్జెట్‌ను కేంద్రం పెంచింది. భారత్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ నాలుగ ఎడిషన్‌ను విజయవంతం చేయాలని ఉద్దేశ్యంతోల ఈ బడ్జెట్‌ను పెంచినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ క్రీడల కోసం రూ. 853 కోట్లు కేటాయించారు. ఇప్పుడు దాన్ని రూ. 1,620 కోట్లకు పెంచారు.

రూ. 1,620 కోట్ల బడ్జెట్‌ కోసం యువ వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2010 కామనవెల్త్ క్రీడల నిర్వాహక కమిటీకి రుణంగా మంజూరు చేయాల్సిందిగా క్రీడా శాఖ తన ప్రతిపాదనలో తెలిపింది.

న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశానంతరం సమాచార శాఖ మంత్రి అంబికా సోనీ విలేకరులతో మాట్లాడుతూ, అంతకుముందు కామన్వెల్త్ క్రీడల కోసం రూ. 767 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ప్రారంభ మరియు ముగింపు కార్యక్రమాల నిర్వహణ కోసమే ఈ బడ్జెట్‌ను పెంచినట్లు ఆమె వివరించారు.

అలాగే... క్వీన్స్ బాటన్ రిలే కార్యక్రమం కోసం రోజుల సంఖ్యను పెంచామన్నారు. అంతర్జాతీయంగా 136 నుంచి 240 రోజులకు పెంచగా.. దేశీయంగా.. 60 రోజుల నుంచి 100 రోజులకు గడువు పెంచారు. ఈ కారణాలతో కామన్వెల్త్ బడ్జెట్ పెంచవలసి వచ్చినట్లుగా అంబికా పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.