వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సుర్జీత్ హాకీ: పాక్ జట్లకు భారత ప్రభుత్వం నిరాకరణ (Surjit Hockey tourny | Pakistan teams | Indian government | refused | Ajit Singh)
Feedback Print Bookmark and Share
 
జలంధర్‌లో రేపటి నుంచి ఇండియన్ ఆయిల్ సర్వో సుర్జీత్ హాకీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో రెండు పాకిస్థాన్ జట్లు కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ రెండు పాక్ జట్లను ఈ టోర్నీలో ఆడేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. ఈ విషయాన్ని జలంధర్ డిప్యూటీ కమిషనర్ అజిత్ సింగ్ పన్ను వెల్లడించారు.

జలంధర్‌లో అజిత్ సింగ్ విలేకరులతో మట్లాడారు. సుర్జీత్ హాకీ సంఘం అధ్యక్షుడిగా కూడా అజిత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది ఇదే టోర్నీలో పాకిస్థాన్ జట్ట్లు జావేద్ హాకీ క్లబ్ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సారి టోర్నీకి పాక్ జట్లకు భారత ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో జావేద్ హాకీ క్లబ్ రావడం లేదని తెలిపారు.

ఈటోర్నీ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరుగుతుందన్నారు. ఇటీవలే ఈ టోర్నీ కోసమని పోలీటాన్ టర్ఫ్‌ను మైదానంలో వేసినట్లు తెలిపారు. ఇది వరకటిలా కాకుండా.. ఈ సారి నిర్వహిస్తున్న టోర్నీకి ప్రత్యేకత ఉందన్నారు. ఈ టోర్నీకి వసూలయ్యే నిధులను వరద సాయంగా అందిస్తామన్నారు. ఎలాంటి ఛార్జీ వసూలు చేయకుండా వీక్షకులను మ్యాచ్‌ను తిలకించేందుకు అనుమతించమన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.