వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కొరియా ఏటీపీ ఛాలెంజర్: వైదొలగిన ప్రకాశ్, పురవ్ (Korea ATP tennis Challenger | Prakash Amritaraj | Purav Raja)
Feedback Print Bookmark and Share
 
కొరియా ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు ప్రకాశ్ అమృతరాజ్ ఓటమి పాలయ్యాడు. అలాగే ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో.. పురవ్ రాజా కూడా పరాజయంతో వైదొలిగాడు. వీరిద్దరి ఓటములతో ఈ టోర్నీలో భారత సవాలు ముగిసింది.

అంతకుముందు, ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లలో నెగ్గిన ప్రకాశ్.. క్వార్టర్స్ చేరుకున్నాడు. అయితే క్వార్టర్స్‌లో డచ్‌కు చెందిన ఇగోయ్ సిజ్లింగ్‌తో ప్రకాశ్ తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇగోయ్ చేతిలో.. 6-7 (5), 4-6తో అన్‌సీడెడ్ ప్రకాశ్ ఓటమి చవిచూశాడు. కానీ, ఈ టోర్నీ రెండు మ్యాచ్‌లలో విజయంతో ప్రకాశ్ 18 ర్యాంకింగ్ పాయింట్లను గెలుచుకున్నాడు.

ఇక డబుల్స్‌లో నాలుగో సీడ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన సాదిక్ కాదిర్‌తో కలిసి బరిలోకి దిగిన పురవ్ రాజా జోడీ తొలి సెట్‌లో మాత్రం రాణించగలిగింది. రెండో సెట్‌ నుంచి చతికిల బడింది. వచ్చిన అవకాశాలను సైతం సద్వినియోగం చేసుకోలేకపోయింది. లాత్వియా, రష్యాలకు చెందిన ఆండిస్ జస్కా, డిమిత్రీ సితాక్‌ల జోడీ చేతిలో 6-3, 3-6, 12-14తో పురవ్, కాదిర్ జోడీ తలవంచింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.