ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జలంధర్‌లో నేటి నుంచి సుర్జీత్ హాకీ టోర్నీ ప్రారంభం (Surjit Hockey tourny | India Hockey News | Jalandhar)
జలంధర్‌లో నేటి నుంచి సుర్జీత్ హాకీ టోర్నీ ప్రారంభం
జలంధర్‌లో నేటి నుంచి 26వ ఇండియన్ ఆయిల్ సర్వో సుర్జీత్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ టోర్నీలో పాకిస్థానీ ప్రదర్శనను మిస్ అయినట్లే. ఏదైతేనేం మొత్తానికి ఈ టోర్నీ కోసం సర్వం సిద్ధం అయింది.
మాజీ ఒలింపియన్ దివంగత సర్ధార్ సుర్జీత్ సింగ్ రంధ్వా పేరిట జలంధర్ ఈ టోర్నీని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. భారత హాకీ మాజీ కెప్టెన్ అయిన సుర్జీత్ సింగ్.. 1984లో జలంధర్ సమీపంలో.. ఓ ఘోర కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సంస్మరణార్థం ఈ టోర్నీకి సుర్జీత్ పేరు పెట్టుకున్నారు.
సుర్జీత్ హాకీ సంఘ అధ్యక్షుడు అజిత్ సింగ్ పన్ను మాట్లాడుతూ. ఈ టోర్నీలో గత ఏడాది రన్నరప్‌లుగా నిలిచిన జావేద్ హాకీ క్లబ్, గోజ్రా (పాక్).. ఈ టోర్నీ పాల్గొనడం లేదన్నారు. భారత ప్రభుత్వం పాక్ జట్లకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ టోర్నీ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో జరుగుతుందన్నారు.
ఈ టోర్నీకి వచ్చే జట్లు, అధికారుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. అన్ని జట్లు నాలుగు పూల్స్‌గా విభజిస్తామన్నారు. మరియు ఒక్కో పూల్‌లో విజేతగా నిలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందన్నారు. సెమీస్ మ్యాచ్‌లు నవంబర్ 12న జరుగుతాయని వివరించారు.