ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా ఇండోర్ గేమ్స్: భారత్‌కు ఆరు పతకాలు (India Sports | Asian Indoor Games | Kabaddi | medals | Pankaj Advani)
హనోయ్‌లో జరుగుతున్న మూడో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారత్‌కు ఒక పసిడి పతకంతో పాటు ఆరు పతకాలు వచ్చాయి. ఈ టోర్నీ పురుషుల విభాగం కబడ్డీలో పసిడి వచ్చింది. ఈ ఆరు పతకాలతో కలిపి ఈ టోర్నీలో మొత్తం భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 33కి చేరుకుంది.
ప్రస్తుతం ఈ టోర్నీలో పతకాల ఆధారంగా తీసుకుంటే.. భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ఈ టోర్నీలో ఫైనల్లో ఇరాన్‌పై 57-33తో భారత కబడ్డీ ఆటగాళ్లు గెలిచారు. దీంతో పసిడిని అందించారు. అంతకుముందు.. స్విమ్మింగ్ ఫ్రీస్టైల్ పురుషుల 200 మీటర్ల విభాగంలో.. అరోన్ డీ సౌజా రజత పతకం సాధించాడు.
అరోన్.. 1 నిమిషయం 48.39 సెకనుల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇదే కేటగిరీలో మరో భారత ఆటగాడు విర్ధ్వాల్ ఖాడే.. కాంస్య పతకాన్ని నెగ్గాడు. ఒక నిమిషం 48.72 సెకనుల్లో లక్ష్యాన్ని అందుకున్నాడు. కె రేబితా దేవీ, జైవంతీలు వరుసగా.. 65కేజీలు, 70కేజీల విభాగాల్లో ఒక్కో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
ఇక ఇంగ్లీష్ బిలయర్డ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన పంకజ్ అద్వానీ కాంస్య పతకాన్ని సాధించాడు. సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో పీటర్ ఎడ్వార్డ్ గిల్‌క్రిస్ట్ చేతిలో 1-3 అద్వానీ ఓటమి చవిచూశాడు.