వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఏటీపీ ఛాలెంజర్ క్వార్టర్స్‌లో సోమ్‌దేవ్, సనమ్ (ATP challenger | quarters | Somdev Devavarman | Sanam Singh)
Feedback Print Bookmark and Share
 
వర్జీనియా నేషనల్ బ్యాంక్ ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత టెన్నిస్ ఏస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవవర్మన్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా సోమ్‌దేవ్ అడుగుపెట్టాడు. ఈ టోర్నీ రెండో రౌండులో దక్షిణాఫ్రికాకు చెందిన డేవిస్ కప్పర్ ఐజాక్ వాన్ డెర్ మెర్వేపై 6-2, 1-6, 6-2తో సోమ్‌దేవ్ గెలుపొందాడు.

తన తర్వాతి మ్యాచ్‌లో సోమ్‌దేవ్.. నెదర్లాండ్స్‌కు చెందిన మాత్వే మిడిల్‌కూప్‌తో తలపడనున్నాడు. రెండో రౌండులో మిడిల్‌కూప్.. అమెరికాకు చెందిన రియాన్ హారిసన్‌పై 1-6, 6-3, 6-2తో గెలుపొందాడు. మరోవైపు.. ఇదే టోర్నీ మరో భారత ఆటగాడు సనమ్ సింగ్ కూడా క్వార్టర్స్ చేరుకున్నాడు.

రెండో రౌండులో.. సనమ్.. అమెరికాకు చెందిన స్కోవిల్లీ జెన్కిన్‌సన్‌పై 1-6, 7-6 (1), 6-4తో విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో సనమ్.. అమెరికాకు చెందిన రెండో సీడ్ ఆటగాడు కెవిన్ కిమ్‌తో క్లిష్టమైన పోటీని ఎదుర్కోనున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.