ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » స్విస్ ఇండోర్ టెన్నిస్: సెమీస్‌కు చేరుకున్న ఫెదరర్ (Roger Federer | Novak Djokovic | Swiss Indoor Tennis | Semifinal,)
స్విస్ ఇండోర్ టెన్నిస్: సెమీస్‌కు చేరుకున్న ఫెదరర్
బేసల్‌లో జరుగుతున్న స్విస్ ఇండోర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎవ్‌గనీ కొరోలెవ్‌పై 6-3, 6-2తో ఫెదరర్ గెలుపొంది సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.
ఇప్పటికే మరో క్వార్టర్స్‌లో స్టానిస్లాస్ వావ్రింకాపై గెలిచిన నొవాక్ జకోవిక్ కూడా సెమీస్ చేరుకున్నాడు. అంచనాలు తప్పకపోతే.. ఈ సారి కాడా ఈ టోర్నీ ఫైనల్లో ఫెదరర్, జకోవిక్‌లు తలపడే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. ఫైనల్లో భీకర పోరు తప్పదు. ఈ భీకర పోరును వీక్షకులు కనులారా తిలకించవచ్చు.
ఇక ఈ టోర్నీ సెమీస్‌లో స్విస్‌కే చెందిన అన్‌సీడెడ్ మార్కో చుడినెల్లీతో ఫెదరర్ తలపడనున్నాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో చుడినెల్లీ.. ఫ్రెంచ్‌కు చెందిన రిచార్డ్ గాస్కెట్‌పై 6-1, 6-3తో గెలుపొంది సెమీస్ చేరుకున్నాడు. ఇక మరో సెమీస్ మ్యాచ్‌లో జకోవిక్.. ఐదో సీడ్ రాడెక్ స్టిపానెక్‌తో తలపడనున్నాడు.