పారిస్ మాస్టర్స్ టెన్నిస్: గాయంతో వైదొలిగిన రాడిక్
రేపటి నుంచి ప్రారంభం కానున్న పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ నుంచి గాయం కారణంగా అమెరికాకు చెందిన టాప్ ర్యాంక్ ఆటగాడు ఆండీ రాడిక్ వైదొలిగినట్లు టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. గత నెలలో షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో రాడిక్ మోకాలికి గాయమైంది.
దీంతో ప్రపంచ నెంబర్ ఆరో ర్యాంకు ఆటగాడైన రాడిక్ ప్రస్తుతం శస్త్ర చికిత్స తీసుకుంటున్నాడని... అందుకని.. పారిస్ మాస్టర్స్‌కు గైర్హాజరీ అవుతున్నట్లు నిర్వాహకులు వివరించారు. అయితే పారిస్ టోర్నీ కోసం రాడిక్ డ్రాలో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఇప్పటికే.. లండన్‌లో నవంబర్ 22 నుంచి 29వ తేదీ వరకు జరిగే ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో రాడిక్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.