ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ స్నూకర్ ఛాంప్స్ : పంకజ్ ముందంజ (Sports I Hyderabad I World Snooker Championship I Pankaj Advani I Masters League I Marishas)
హైదరాబాద్ నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్లో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ జోరు కొనసాగుతోంది. తొలిరోజు పురుషుల విభాగం ప్రిలిమినరీ రౌండ్‌లో అలవోక విజయం సాధించిన పంకజ్.. మాస్టర్స్ లీగ్ విభాగంలో తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి ముందంజలో ఉన్నాడు.
మారిషస్‌కు చెందిన మూసా సలీమ్‌పై 84-0, 85-22, 75-21, 78-39 వరుస ఫ్రేమ్‌లతో పంకజ్ గెలుపొందాడు. అయితే మరోవైపు భారత వెటరన్ గీత్‌సేథీ మాత్రం కాస్తంత తడబడి చివరకు గెలుపొందాడు. మాస్టర్స్ విభాగంలో గీత్‌సేథీ 3-2 (36-82, 69(69)-25, 65 -33, 16-60, 59-30) తేడాతో మాల్టాకు చెందిన సిమన్ జమిట్‌పై పోరాడి నెగ్గాడు.
మరో గేమ్‌లో మాజీ ఆసియా ఛాంపియన్ మర్చెంట్ 4-3 ఫ్రేమ్లతో ఐర్లాండ్‌కు చెందిన మారియో ఫెర్నాండెజ్‌ను మట్టిగరిపించాడు. మాజీ ఆసియా ఇండోర్ రజక పతక విజేత మనన్ చంద్ర 4-1తో లిబియాకు చెందిన ఖలీద్ మహ్మద్‌పై గెలుపొంది.. తొలిరోజు పరాజయానికి కాస్తంత ఊరట పొందాడు.
ఇదిలా ఉంటే.. జాతీయ ఛాంపియన్లయిన మీనల్ థాకూర్, సునితి దామిలు వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇక స్టార్ క్యూయిస్ట్‌లు విద్యా పిళ్లై, చిత్ర మగిమైరాజ్, ప్రవీణలు రెండో రౌండ్లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.