ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » "పారిస్ టైటిల్" అంత సులువేం కాదు : జెకోవిచ్ (Sports | France | ATP World Tour 1000 Event | Paris Masters Tennis Title | Serbian | Novak Djokovic)
ఫ్రాన్స్‌లో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ 1000 ఈవెంట్‌లో "పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టైటిల్"ను సాధించిన సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జెకోవిచ్... ఆ విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదని వ్యాఖ్యానించాడు. గేల్ మోన్‌ఫిస్‌పై తలపడ్డ ఫైనల్ గేమ్ చాలా కష్టతరమైనదని అన్నాడు.
నిజంగా ఫైనల్ గేమ్ చాలా కష్టమైనదనీ.. గేల్ మోన్‌ఫిస్ అద్భుతమైన ఆటగాడనీ, ఆయన బాల్‌ను ఎదుర్కొన్న తీరు అమోఘమని జెకోవిచ్ కొనియాడినట్లు... హెరాల్డ్ సన్ పత్రిక ఓ కథనాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. నవంబర్ 15వ తేదీన జరిగిన ఫైనల్స్‌లో జెకోవిచ్ 6-2, 5-7, 7-6 (7-3) స్కోరు తేడాతో మోన్‌ఫిస్‌పై గెలుపొంది, టైటిల్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే..!
పారిస్ టైటిల్ విజేతగా నిలిచిన జెకోవిచ్ 4,50,000 యూరోల (భారత కరెన్సీలో రూ. 3 కోట్ల 10 లక్షలు)ను ఫ్రైజ్‌మనీగా అందుకున్న సంగతి పాఠకులకు తెలిసిందే. విజయానంతరం జెకోవిచ్ మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ మొదటి స్థానంలో నిలబెట్టినా, ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించేందుకు ఆటగాళ్లను సన్నద్ధం చేస్తాయని పేర్కొన్నాడు.