వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ : రాజేందర్‌కు స్వర్ణం (Sports I YS Rajasekhara Reddy I National Junior Sub Junior Athletics Championship I Rajender I)
Feedback Print Bookmark and Share
 
Athletics
FILE
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక జాతీయ జూనియర్, సబ్‌ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తొలిరోజే ఆంధ్రప్రదేశ్ పతకాల బోణీ చేసింది. మంగళవారం హన్మకొండ జేఎన్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలలో అండర్-16 బాలుర 3 వేల మీటర్ల రేసులో రాజేందర్ సింగ్ రాష్ట్రానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు.

3 వేల మీటర్ల రేసు లక్ష్యాన్ని రాజేందర్ 9 నిమిషాల 07 సెకన్లలో ఛేదించి అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే అండర్-20 బాలికల 3 వేల మీటర్ల రేసులో రాష్ట్రానికే చెందిన వనిత కాంస్య పతకాన్ని సాధించింది. పది నిమిషాల 41 సెకన్లలో లక్ష్యానికి చేరుకున్న వనిత మూడో స్థానంలో నిలిచింది. మొత్తంమీదా ఈ పోటీల తొలిరోజున ఆంధ్రప్రదేశ్‌కు రెండు పతకాలు లభించాయి.

అలాగే.. ఈ పోటీల తొలి రోజున మరో రెండు కొత్త జాతీయ రికార్డులు కూడా నమోదయ్యాయి. అండర్-14 బాలుర షాట్‌ఫుట్‌లో కేరళకు చెందిన నిఖిల్ నితిన్ ఇనుప గుండును 13.41 మీటర్ల దూరం విసిరి రికార్డు సృష్టించాడు. దీంతో తమిళనాడుకు చెందిన ఎస్.ఎల్.మూర్తి 12.48 మీటర్లతో ఉన్న రికార్డును నితిన్ అధిగమించాడు.

అండర్-14 బాలికల షాట్‌ఫుట్‌లో తమిళనాడుకు చెందిన కె. సుభాషిణి కూడా మరో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇనుప గుండను 10.17 మీటర్ల దూరం విసిరిన సుభాషిణి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుమునుపు ఈ పోటీలను రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రారంభించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.