ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » మహిళా బాక్సర్ మృతిపై విచారణ ప్రారంభం (Sports | Woman Boxer | Amaravathi | Suicide | Andhra Pradesh | SAP | MD | Radha | Narsaiah | Boxing)
బాక్సర్ అమరావతి ఆత్మహత్య అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఎండీ రాధ ఆధ్వర్యంలో ఈ కమిటీ ప్రాథమిక విచారణ చేపట్టింది. అమరావతి కుటుంబ సభ్యులు, ఆమెతోపాటు హాస్టల్‌లో ఉంటున్న వాలీబాల్ క్రీడాకారిణులు, వార్డెన్, తోటి బాక్సర్లు, బాక్సింగ్ సంఘం ప్రతినిధులతో సహా.. పలువురితో రాధ మాట్లాడారు.
ఈ సందర్భంగా రాధ కలిసిన అందరు చెప్పిన వివరాలను రాత పూర్వకంగా కూడా ఇవ్వాలని కోరారు. కాగా.. అమరావతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలను తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వం శాప్ ఎండీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్ స్కూల్ ప్రత్యేకాధికారి నర్సయ్య, రాధలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గురువారం మరోసారి సమావేశం కానుంది.
ఇదిలా ఉంటే.. జాతీయ బాక్సింగ్‌లో సత్తాను చాటుకుంటున్న వర్ధమాన క్రీడాతార ఎస్. అమరావతి (23) నవంబర్4వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలోగల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ హాస్టల్‌లో ఆమె ఈ ఘటనకు పాల్పడింది. కోచ్ వేధింపులే అమరావతిని ఆత్మహత్యకు ప్రేరేపించాయని పలు ఆరోపణలు వినవస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే..!