వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ స్నూకర్‌లో భారత ఆటగాళ్ల హవా! (World Snooker ChampionShip| Hyderabad| Alok kumar| Geet Sethi| Sports| News)
Feedback Print Bookmark and Share
 
రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో జరుగుతున్న ఐబిఎస్ఎఫ్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అలోక్ కుమార్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో పురుషుల విభాగం నాకౌట్ దశకు అలోక్ కుమార్ చేరుకున్నాడు.

బుధవారం జరిగిన గ్రూప్ గేమ్‌లో అలోక్ 4-0 తేడాతో రయాన్ సోమరత్న (శ్రీలంక)ను ఓడించడం ద్వారా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో అలోక్ కుమార్ ఒక్క గేమ్‌ను కూడా చేజార్చుకోకపోవడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఏస్ క్రీడాకారులు గీత్‌సేథీ మాస్టర్స్ విభాగంలో 3-0 తేడాతో అబ్దుల్ (ఖతర్)ను ఓడించాడు. అలాగే కమల్ చావ్లా, బ్రిజేశ్ దమని సైతం తమ తమ గేమ్‌లలో గెలుపొందారు.

మహిళల విభాగంలో గ్రూప్-బిలో బిలో విద్యాపిళ్లై 3-0 తేడాతో భారత్‌కు చెందిన నీతా సాంఘ్విపై, 3-0తో నెల్హా సున్నీ (బహ్రెయిన్)పై విజయం సాధించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.