వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన చైనా! (Asian Table Tennis Championships| semifinals| China| Sports| Japan)
Feedback Print Bookmark and Share
 
ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. చైనాకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి.

ఇందులో భాగంగా చైనా పురుషుల జట్టు భారత్‌ను 3-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగే చైనా మహిళల జట్టు థాయ్‌లాండ్‌పై 3-0 తేడాతో నెగ్గింది.

చైనాతో పాటు హాంగ్‌కాంగ్, సింగపూర్, కొరియాలు కూడా ఆసియన్ టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ జట్టు కొరియాపై 3-1 తేడాతో ఓడించగా, జపాన్ కొరియాపై 3-1, చైనీస్ తైపీ సింగపూర్‌ను మట్టికరిపించాయి.

అలాగే మహిళల విభాగంలో కొరియాపై 3-0తో నెగ్గిన సింగపూర్, జపాన్‌ను 3-1 తేడాతో ఓడించిన కొరియా జట్లు సైమీఫైనల్లోకి చేరుకున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.