వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » చైనా సూపర్ సిరీస్: సైనా, అరవింద్ ఔట్! (Arvind Bhatt| Saina Nehwal| China Super Series| Sports| Badminton)
Feedback Print Bookmark and Share
 
Saina
FILE
భారతీయ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, అరవింద్ భట్‌లకు చైనా సూపర్ సిరీస్‌లో చుక్కెదురైంది. చైనాలోని షాంగైలో జరుగుతోన్న ఈ టోర్నీ మహిళల రెండో రౌండ్లో చైనాకు చెంది జియా జింగ్యున్‌తో తలపడని సైనా నెహ్వాల్, 21-17, 8-21, 13-21 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది.

52నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించి, గెలుపును నమోదు చేసుకోలేకపోయింది. ఫలితంగా చైనా సూపర్ సిరీస్ నుంచి ఇంటి ముఖం పట్టింది.

అలాగే మరో భారతీయ ఆటగాడు అరవింద్ తన రెండో రౌండ్ మ్యాచ్‌లో కున్కోరో సోని (ఇండోనేషియా) చేతిలో ఖంగుతిన్నాడు. 15-21, 16-21 పాయింట్ల తేడాతో ఎనిమిదో సీడ్ కున్కోరో సోని చేతిలో ఓడటంతో ఈ టోర్నీ సింగిల్స్ నుంచి అరవింద్ భట్ నిష్క్రమించాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.