ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వరల్డ్ బ్లిట్జ్ చెస్: రెండో స్థానంలో ఆనంద్ (SportsI ChessI Viswanathan AnandI World Blitz ChessI Second Place)
వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మూడు రోజుల పాటు జరిగిన 42 రౌండ్ల డబుల్ రౌండ్ రాబిన్ టోర్నీలో ఆనంద్ మొత్తం 20 విజయాలను నమోదు చేసుకున్నాడు.
అలాగే మరో 16 గేమ్‌లను డ్రాగా ముగించి, ఆరు గేమ్‌లలో ఓటమిని చవిచూశాడు. దీంతో మొత్తం 28 పాయింట్లను కూడగట్టుకుని రెండో స్థానంలో నిలిచాడు. మూడు పాయింట్ల ఆధిక్యంతో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) టైటిల్‌ను గెలుచుకుని అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.