ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఏటీపీ టూర్: ఫైనల్లో డెల్ పోట్రోతో ముర్రే ఢీ! (Andy Murray| World Tour finals| Del Potro| Roger Federer| Rafael Nadal| Sports)
బ్రిటన్‌కు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్లో యూఎస్ ఓపెన్ ఛాంపియన్ జువాన్ మార్టిన్ డెల్ పోట్రోతో బరిలోకి దిగనున్నాడు. ఏటీపీ వరల్డ్ టూర్‌లో ప్రత్యర్థులపై గట్టిపోటీని ప్రదర్శించి ఫైనల్ వరకు చేరుకున్నాడు. అలాగే ఆదివారం జరిగే ఫైనల్లోనూ డెల్ పోట్రోపై ధీటుగా రాణించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
లండన్‌లో సోమవారం జరిగే ఇదే ఏటీపీ టూర్‌లో ప్రపంచ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్ తన రెండో గేమ్‌లో ఫెర్నాండొ వెర్దాస్కో (స్పెయిన్)తో తలపడతాడు అలాగే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సోమవారం జరిగే మ్యాచ్‌లో రాబిన్ సదర్లింగ్ (స్వీడెన్)తో బరిలోకి దిగనున్నాడు. ఇదేవిధంగా సెర్బియన్ నొవాక్ జకోవిచ్ సోమవారం జరిగే మ్యాచ్‌లో నికొలే డేవిడెంకో (రష్యా)తో పోటీ పడతాడు.