ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఏటీపీ ఛాలెంజర్: క్వార్టర్స్‌లో మన్కడ్ జోడీ (Harsh Mankad| ATP Challenger| Purav Raja| Tennis| Quarter-finals| Sports)
ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్లో భారతీయ హర్ష్ మన్కడ్ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ తొలి రౌండ్లో గట్టి పోటీని ప్రదర్శించిన భారత్-పిలిఫ్పైన్స్ జంట హర్ష్ మన్కడ్-కొనార్డ్‌లు 6-4, 6-3 పాయింట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.
50వేల డాలర్ల ప్రైజ్‌మనీ కలిగిన ఈ హార్ట్ కోర్టు టోర్నీ తొలి రౌండ్లో అమెరికన్ నికొలే మొనారే మరియు ఇజాక్ వాన్ డేర్ వెర్వ్ (దక్షిణాఫ్రికా)ల జట్టుతో మన్కడ్ జోడీ తలపడింది. ప్రత్యర్థి జట్టు షాట్లకు గట్టిపోటీనిచ్చిన మన్కడ్ జోడీ విజయాన్ని నమోదు చేసుకుని క్వార్టర్ పైనల్లోకి దూసుకెళ్లింది.
మరో భారత ఆటగాడు పురవ్ రాజా తన బ్రిటిష్ భాగస్వామి రిచర్డ్ బ్లూమ్‌ఫీల్డ్‌తో కలిసి డొమినిక్ ఇగ్లోట్ (బ్రిటన్)- రిలాన్ రిజా (అమెరికా) ద్వయంతో తలపడ్డాడు. కానీ ప్రత్యర్థి జట్టుపై మెరుగ్గా ఆడలేని రాజా ద్వయం డొమినిక్ జంట చేతిలో0-6, 6-7 పాయింట్ల తేడాతో ఖంగుతింది. ఫలితంగా ఈ టోర్నీ డబుల్స్ విభాగం నుంచి పురవ్ రాజా జోడీ నిష్క్రమించాల్సి వచ్చింది.