ఉత్తరప్రదేశ్ బ్యాడ్మింటన్ అకాడమీ హాల్‌లో జరుగుతున్న 19వ ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా తన హవాను కొనసాగిస్తోంది. పురుషుల, మహిళల విభాగంలో చైనా ప్రత్యర్థులను ఖంగుతినిపించింది. పురుషుల విభాగం ఫైనల్లో జపాన్‌ను 3-2 తేడాతో ఓడించింది. అలాగే మహిళల ఫైనల్ పోరులో 3-1 పాయింట్ల తేడాతో సింగపూర్‌ను ఓడించి గెలుపును నమోదు చేసుకుంది.
గురువారం రాత్రి జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల విభాగం తరపున బరిలోకి దిగిన చైనా జపాన్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. పురుషుల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన జు-జింగ్ కెంటా మట్సుదైరాను 7-11,5-11,11-5 పాయింట్ల తేడాతో ఓడించగా, జాంగ్ జైక్ జున్ మిత్జుటానిపై 11-5, 11-9, 2-11 and 11-8 పాయింట్ల తేడాతో ఓడించాడు.
అలాగే మహిళల విభాగంలో ఫాంగ్ యింగ్ 11-8,11-4 పాయింట్ల తేడాతో ఫెంగ్ టియాన్‌వెల్ (సింగపూర్)ను ఓడించి చైనాకు టైటిల్‌ను సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఇదేవిధంగా.. మరో చైనా క్రీడాకారిణి డింగ్ నింగ్ 8-11,11-8, 11-6 పాయింట్ల తేడాతో వాంగ్ యెంగ్యూను మట్టికరిపించింది. కానీ లి జియావోజియా (చైనా) మాత్రమే సన్ బీబీ చేతిలో 6-11,11-6, 8-11 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది.