వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » పంచాయతీ యువక్రీడా పోటీలకు తమిళనాడు ఆతిథ్యం (PYKKA national competitions| Tamilnadu| Sports| November 21)
Feedback Print Bookmark and Share
 
జాతీయ స్థాయి పంచాయతీ యువక్రీడా పోటీలకు తమిళనాడు ఆతిథ్యమిస్తోంది. పంచాయతీ యువ క్రీడా అర్ ఖేల్ అభియాన్ (పీవైకెకెఎ) పేరిట తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోన్న ఈ పోటీలు నవంబర్ 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయి. గ్రూప్-1 విభాగంలో జరిగే ఈ జాతీయ స్థాయి పోటీల్లో భాగంగా అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వ్రెస్ట్లింగ్, వైట్ లిఫ్టింగ్ వంటి తదితర క్రీడల్లో ఆటగాళ్లు పాల్గొనవచ్చు.

గ్రూప్-2 విభాగంలో ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలుంటాయి. గ్రూప్-2 పోటీలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు భోపాల్‌లో జరుగుతాయి.

అలాగే గ్రూప్-3 జాతీయ స్థాయి పోటీలకు పంజాబ్ ఆతిథ్యమిస్తోంది. ఇందులో ఆర్చరీ, వాలీబాల్, కబడ్డీ, కో-కో మరియు బాక్సింగ్ వంటి క్రీడలు జరుగుతాయి. ఈ పోటీలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే గ్రూప్-5 విభాగంలో జరిగే పోటీలను బెంగళూరులో జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.