ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్లో భారత హర్ష్ మన్కడ్ జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతోన్న ఈ టోర్నీలో భాగంగా, భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు హర్ష్ మన్కడ్ తన ఫిలిప్పైన్స్ భాగస్వామి ట్రీట్ కోనార్డ్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లో విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్ పోరులో హర్ష్ మన్కడ్-ట్రీట్ కోనార్డ్ జంట 3-6,7-6 (7/5), 10-7 పాయింట్ల తేడాతో డోమినిక్ ఇంగ్లాట్ (బ్రిటన్)-రేయాన్ రిజా (అమెరికా)లపై గెలిచింది. సెమీస్‌లో హర్ష్ ద్వయం ఎమ్రిచ్-సిల్ స్ట్రామ్ జోడీతో తలపడుతుంది.