ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా ఆర్చరీ: భారత్‌కు తొలి స్వర్ణపతకం (Asia Archery ChampionshipI SportsI NewsI GoldI Silver MedalsI India)
ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు. ఈ పోటీల్లో తొలి బంగారు పతకం సాధించి రికార్డును నమోదు చేసుకున్నారు.
బాలీలో జరుగుతోన్న ఈ పోటీల్లో సి. శ్రీథర్, కె.హెచ్. రతన్ సింగ్, ఆర్. సనమ్ బృందం 231-230 పాయింట్లతో ఇరాన్‌పై గెలిచి తొలి బంగారు పతకం సాధించింది. దీంతో పాటు శుక్రవారం నాటి పోటీల్లో భారత్ రెండు రజత పతకాలను సొంతం చేసుకుంది.
పురుషుల రికర్వ్‌లో, మహిళల కాంపౌండ్ విభాగాల్లో భారత్‌కు రెండు రజత పతకాలు సాధించింది. రికర్వ్ ఫైనల్లో రాహుల్ బెనర్జీ, జయంత తాలుక్దార్, మంగల్‌సింగ్ చాంపియా బృందం 219-222తో కొరియా చేతిలో స్వర్ణాన్ని కోల్పోయినా.. రజతంతో సరిపెట్టుకుంది.