వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఐర్లాండ్‌తో మ్యాచ్‌ని మళ్లీ నిర్వహించాలి: హెన్రీ (Ireland| Football| France| Henry| FIFA| Sports| European Jone Qualifying match)
Feedback Print Bookmark and Share
 
తాను కావాలనే బంతిని చేతితో ఆపలేదని.. ఒత్తిడిలో అలా జరిగిపోయిందని ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్ థియరీ హెన్రీ అన్నాడు. ఇంకా ఐర్లాండ్‌తో మ్యాచ్‌ని మళ్లీ నిర్వహించాలని సూచించాడు. చేతితో బంతిని ఆపిన వివాదానికి మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించడమే సరైన మార్గమని హెన్రీ తెలిపాడు.

అయితే ఐర్లాండ్-ఫిఫాల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింద్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించే ప్రసక్తే లేదని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్పష్టం చేసింది. మ్యాచ్ ఫలితాన్ని కూడా మార్చే ఉద్దేశం లేదని, మ్యాచ్‌ను మళ్లీ ఆడించాలని ఐర్లాండ్ ఫుట్‌బాల్ అధికారులు మరియు ఫ్రాన్స్ కెప్టెన్ హెన్రీలు చేసిన విజ్ఞప్తిని ఫిఫా తోసిపుచ్చింది.

ఇదిలా ఉంటే... ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన యూరోపియన్ జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు విలియమ్ గల్లాస్ చేసిన ఏకైక గోల్ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. కెప్టెన్ హెన్రీ చేతికి తగిలిన బంతిని పాస్ చేయడంతో గల్లాస్ దాన్ని గోల్‌గా మలచడం వివాదానికి దారి తీసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.