వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ స్నూకర్‌లో భారత ఆటగాళ్ల హవా! (World Snooker Championship| Hyderabad| Sports| News| Pankaj Advani| Alok kumar)
Feedback Print Bookmark and Share
 
హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు ఓ మెరుపు మెరిశారు. ఇందులో స్టార్ క్రీడాకారిణి చిత్ర మగిమైరాజ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, పంకజ్, గీత్‌సేథి, జోషిలు ప్రి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ క్రీడాకారికణి చిత్ర మగిమైరాజ్ 4-2 (54-05, 59-34, 47-51, 61-27, 58-62, 50-28) పాయింట్ల తేడాతో థాయిలాండ్‌కు చెందిన నిచా పాథామ్‌పై పోరాడి గెలిచింది.

పురుషుల విభాగంలో పంకజ్ అద్వానీ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. స్కాట్‌లాండ్‌కు చెందిన హూక్స్ హ్రాంక్స్‌తో తలపడిన పంకజ్ 102-8, 74-27, 50-37, 59-56 తేడాతో గెలుపును నమోదు చేసుకున్నాడు.

అలాగే మాస్టర్స్ విభాగంలో వెటరన్ ఆటగాడు గీత్‌సేథీ 4-0 తేడాతో హెచ్. కామరాజ్‌ను ఓడించి ప్రి క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మరోగేమ్‌లో సీనియర్ ఆటగాడు దేవేంద్ర జోషి 4-1 ఫ్రేమ్‌ల తేడాతో అహ్మద్ అల్తార్‌కైత్‌పై గెలవగా, యాసిన్ మర్చెంట్, అలోక్‌కుమార్‌లు తమ ప్రత్యర్థులపై గెలిచి ప్రి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.