ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సందీప్ 2010 వరల్డ్ కప్‌లో ఆడతాడు : ఏకే మట్టూ (Sports | Hockey Star | Sandeep Singh | Chammpions Challenge Tournament | World Cup | H.I. | A K)
ప్రముఖ హాకీ స్టార్ సందీప్ సింగ్ ఛాంపియన్స్ ఛాలెంజ్ టోర్నమెంట్‌తో పాటు, 2010లో జరగబోయే ప్రపంచ కప్‌లో కూడా ఆడతాడని.. భారత హాకీ (హెచ్.ఐ.) అధ్యక్షుడు ఏకే మట్టూ స్పష్టం చేశారు. దీంతో సందీప్ ఛాంపియన్స్ ఛాలెంజ్‌లో పాల్గొనడంపై ఏర్పడిన సందేహాలకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది.
హెచ్.ఐ.తో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఒప్పందం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏకే మట్టూ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. సందీప్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడనీ, ఇప్పుడు మంచి ఫిట్‌నెస్‌తో కూడా ఉన్నాడని ఆయన స్పష్టం చేశాడు.
అంతేగాకుండా... సందీప్ వచ్చే ఏడాదిలో జరిగబోయే ప్రపంచ కప్‌లో ఆడతాడనీ భరోసా ఇవ్వగలననీ, అంతకుమునుపు ఛాంపియన్స్ ఛాలెంజ్‌లో కూడా సందీప్ పాల్గొంటాడనీ ఏకే మట్టూ వివరించారు. ఇదిలా ఉంటే.. గాయంతో బాధపడుతున్న సందీప్ పై రెండు మెగా ఈవెంట్లకు దూరం కావచ్చునని కోచ్ జోస్ బ్రాసా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల సందిగ్ధానికి మట్టూ ప్రకటనతో తెరపడినట్లయింది.