ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » గ్రాండ్ స్లామ్ క్లబ్‌లోకి త్వరలోనే తిరిగొస్తా : ముర్రే (Sports | Britan | Andy Murray | Juan Martin del Potro | Grand Slam Club | U S Open | ATP World Tour)
గ్రాండ్ స్లామ్ క్లబ్‌లోకి త్వరలోనే తిరిగొస్తా : ముర్రే
FILE
బ్రిటన్ యువ సంచలనం, ప్రపంచ నెంబర్ ఫోర్ ఆండీ ముర్రే త్వరలోనే... గ్రాండ్ స్లామ్ క్లబ్‌లోకి తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం నుంచి జరగబోయే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ముర్రే.. యూఎస్ ఓపెన్ ఛాంపియన్ జాన్ మార్టిన్ డెల్ పొట్రోతో తలపడనున్నాడు.
ఈ సందర్భంగా ముర్రే మాట్లాడుతూ... ఈ టోర్నీలో విజయం సాధించి తీరుతాననీ, నెంబర్‌వన్ అవటమే తన ఏకైక లక్ష్యమని చెప్పాడు. ప్రస్తుతం తాను మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాననీ, వైవిధ్యమైన ఆటతీరుతో గెలుపొంది, మళ్లీ గ్రాండ్ స్లామ్ క్లబ్‌లోకి తిరిగి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. 21 ఏళ్ల ముర్రే చాలాసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకోవటమేగాక.. రెండు ఏటీపీ టైటిళ్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే..!
కాగా... ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎనిమిది మంది మేటి ఆటగాళ్లు తలపడనున్నారు. ఇందులో గెలుపొందిన విజేతలు ఒక మిలియన్ డాలర్లను బహుమతిగా అందుకోనున్నారు. వింబుల్డన్ తరువాత యూకేలో అతిపెద్ద ఇండోర్ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఈ టోర్నీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.