ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ స్నూకర్ ఛాంప్స్ : క్వార్టర్స్‌లో గీత్ సేథీ (Sports | Hyderabad | International Convention Centre | World Snooker Championship | Geet)
ప్రపంచ స్నూకర్ ఛాంప్స్ : క్వార్టర్స్‌లో గీత్ సేథీ
FILE
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్లో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో వెటరన్ ఆటగాడు గీత్ సేథీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మాస్టర్స్ ఫ్రీ క్వార్టర్ ఫైనల్ పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన చూచార్ట్‌పై సేథీ 4-0 తేడాతో సునాయాస విజయం సాధించాడు.
ఆట ప్రారంభం నుంచీ తన క్లాస్ చూపిస్తూ వరుసగా నాలుగు ఫ్రేమ్‌లను కైవసం చేసుకున్న గీత్ సేథీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అలాగే పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు లక్కీ వత్నాని ఫ్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. సింగపూర్‌కి చెందిన లిమ్చున్ కైట్‌పై 4-1 (68-42, 54-24, 26-69, 59-38, 68-50) ఫ్రేమ్‌ల తేడాతో గెలుపొంది, ఫ్రీ క్వార్టర్స్‌లోకి చేరుకున్నాడు.
అలాగే మాస్టర్స్ విభాగంలో.. గ్లెన్ విల్కిన్‌సన్ 4-2 ఫ్రేమ్‌ల తేడాతో ర్యాన్‌జోన్స్‌పై, కోట్సాస్ కొనారిస్ 4-3 ఫ్రేమ్‌ల తేడాతో అలీ జాఫర్‌పై, డినె ఒకానె 4-0 ఫ్రేమ్‌ల తేడాతో హితేష్ నారెన్‌పై విజయం సాధించారు.