ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ : ఏపీకి 4వ స్థానం (Sports | National Junior | Sub Junior Athletics Championship Kerala | First Place | Andhra)
జాతీయ స్థాయి జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేరళ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 24 స్వర్ణాలు, 30 రజతాలు, 17 కాంస్య పతకాలతో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కేరళ సొంతం చేసుకుంది. అయితే... మొత్తం పది స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్య పథకాలతో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం నాలుగో స్థానంలో నిలిచింది.
పోటీల చివరి రోజైన శనివారం రోజున ఆంధ్రప్రదేశ్‌కు ఐదు పతకాలు లభించాయి. వరంగల్‌లో ముగిసిన ఈ పోటీలలో ఆఖరి రోజున తమిళనాడు అనూహ్యంగా రాణించి ఏకంగా పది స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. అంతేగాకుండా మొత్తం 21 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది.
16 స్వర్ణ పతకాలతో హర్యానా మూడో స్థానాన్ని సంపాదించింది. అండర్-14 బాలుర విభాగంలో కేరళ ప్రథమ స్థానంలో నిలువగా.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అలాగే బాలుర అండర్-14 విభాగంలో ఏపీ ఆటగాడు జనార్ధన్ రావు (ట్రయథ్లాన్ 725 పాయింట్లు) ఉత్తమ అథ్లెట్‌గా ఎంపికయ్యాడు.