ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఫ్రైజ్ మనీ ఏ మూలకూ చాలట్లేదు : విద్యా పిళ్లై (Sports | Billiards | Snooker | Prize Money | Vidya Pillai | Hyderabad | World Snooker Championship | Title)
దేశంలో బిలియర్డ్స్, స్నూకర్ టోర్నీలే కరువైపోయాయనీ.. ఒకవేళ టోర్నీలు పెట్టినా, ఒక జాతీయ ఛాంపియన్‌కు నిర్వాహకులు ఇచ్చే ఫ్రైజ్‌మనీ ఏ మూలకూ సరిపోవటం లేదని.. భారత నెంబర్‌వన్ క్రీడాకారిణి, ఐదుసార్లు జాతీయ స్నూకర్, బిలియర్డ్స్ టైటిళ్లు సాధించిన విద్యా పిళ్లై ఆవేదన వ్యక్తం చేస్తోంది.
హైదరాబాద్ కన్వెన్షనల్ సెంటర్లో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో విజయాలతో దూసుకెళ్తోన్న చెన్నై నగరానికి చెందిన విద్యాపిళ్లై మీడియాతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బిలియర్డ్స్, స్నూకర్ లాంటి క్రీడల్లో అమ్మాయిలకు ప్రాధాన్యం పెరగాలంటే ఇంకాస్త సమయం పడుతుందని వ్యాఖ్యానించింది.
మన దేశంలో సరైన టోర్నీలు లేకపోవటం.. బిలియర్డ్స్, స్నూకర్ క్రీడలమీద చాలామందికి అవగాహన లేకపోవటంతో అంత త్వరగా వీటివైపు మొగ్గుచూపటంలేదని విద్యా వివరించింది. ముఖ్యంగా ఈ టోర్నీలలో నెగ్గిన క్రీడాకారిణులకు ఇచ్చే ఫ్రైజ్ మనీ 5 నుంచి పది వేల లోపేనని, మిగిలిన క్రీడలతో పోలిస్తే ఖర్చులు ఎక్కువయ్యే క్యూ గేమ్‌లలో ఈ సొమ్ము ఏ మూలకూ చాలదని చెప్పింది.
అందరూ అనుకునేటట్లు బిలియర్డ్స్ అంత సులభంగా గెలిచే ఆట కాదనీ, దీంట్లో ఏకాగ్రతతోపాటు విశ్వాసం ఉండటం కూడా చా ముఖ్యమని విద్యా పిళ్లై పేర్కొంది. బిలియర్డ్స్ ఆడటం ప్రారంభించిన ఆరు నెలలకే 2002లో జమ్మూలో జాతీయ బిలియర్డ్స్ టైటిల్ సాధించటం, ఐదు జాతీయ సీనియర్ టైటిళ్లు సాధించటం.. ప్రపంచ స్నూకర్ ఛాంప్స్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరటం.. లాంటివి ఎప్పటికీ మరచిపోలేని అమూల్యమైన విజయాలని విద్యా సంతోషం వ్యక్తం చేసింది.