వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఇరాకీ రెఫరీ అహ్మద్ అలీ సస్పెండ్ చేసిన "ఏఎఫ్‌సీ" (Sports | FIFA | FIFA Governing Body | Iraq Football Association | Ali Tariq Ahmed Ali | AFC Cup)
Feedback Print Bookmark and Share
 
Football
FILE
ఫిఫా గవర్నింగ్ బాడీ ఇరాక్ ఫుట్‌బాల్‌ సంఘంపై నిషేధం విధించిన నేపథ్యంలో... ఇరాకీ రెఫరీ ఆసెసర్ అలీ తారిఖ్ అహ్మద్ అలీని "ది ఏసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ)" సస్పెండ్ చేసింది. ఫిఫా గవర్నింగ్ బాడీ శుక్రవారం రోజున ఇరాక్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌పై నిషేధం విధించిన అనంతరం.. ఇరాక్ ఒలింపిక్ కమిటీ, అలీని సస్పెండ్ చేసేందుకు నిర్ణయించుకుంది.

2003వ సంవత్సరం నుంచి ఇరాక్ ఫుట్‌బాల్ రెఫరీ ఆసెసర్‌గా సేవలందిస్తోన్న అలీ.. ఆ దేశంలో మంచి గుర్తింపు కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరం ఏఎఫ్‌సీ ఏషియన్ కప్ 2011 క్వాలిఫయిర్స్‌ను ఎంపిక చేసేందుకుగానూ జరిగిన ఆరు సందర్భాల్లోనూ అలీ కీలక పాత్ర పోషించాడు. అలాగే.. 2007 ఏషియన్ నేషనల్ కప్‌ విజయంలో కూడా ఆయన పాత్ర చెప్పుకోదగ్గది.

ఇదిలా ఉంటే.. ఇరాక్ ఫుట్‌బాల్ సంఘం (ఐఎఫ్ఏ)పై విధిస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ శనివారం ప్రకటించారు. తదుపరి నిర్ణయం తీసుకునేంతదాకా ఈ నిషేధం కొనసాగుతుందని, నిషేధంలో భాగంగా.. ఫిఫా నుంచి ఐఎఫ్ఏకి ఎలాంటి ఆర్థిక సహకారమూ లభించదని ఆయన స్పష్టం చేశారు.

అలాగే.. ఇరాక్ దేశానికి సంబంధించిన క్లబ్, లీగ్ జట్లను అంతర్జాతీయ, ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో సైతం ఆడేందుకు అనుమతించరని బ్లాటర్ వివరించారు. కాగా... ప్రభుత్వ మితిమీరిన జోక్యాన్ని సహించని ఫిఫా.. ఐఎఫ్ఏపై వేటు వేసినట్లు పలువురు క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.