వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హాకీ : సందీప్‌కు విశ్రాంతి.. కెప్టెన్‌గా రాజ్‌పాల్ (Sports | Hockey India | Sandeep Singh | Drog Flickr | Cheap Coach | Brasa | Diwakar Ram)
Feedback Print Bookmark and Share
 
Hockey
FILE
భారత హాకీ జట్టులో రోజుకో పరిణామం జరుగుతోంది. సందీప్ సింగ్ ఫిట్‌గా ఉన్నాడని ఒకసారి, కెప్టెన్సీని మార్చే ప్రసక్తే లేదని మరోసారి, సీనియర్ల తిరుగుబాటు అంటూ ఇంకోసారి... అనిశ్చితి రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న సందీప్ సింగ్‌కు విశ్రాంతి అవసరమనీ, అతని స్థానంలో దివాకర్ రామ్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్.ఐ.) ప్రెసిడెంట్ అశోక్ కుమార్ మట్టూ ప్రకటించాడు.

అలాగే జట్టుకు కెప్టెన్‌గా రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరించనున్నాడని మట్టూ వివరించాడు. కాగా.. డ్రాగ్ ఫ్లికర్ సందీప్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని ప్రకటించి ఒక రోజు గడవకముందే... హాకీ ఇండియా ప్రెసిడెంట్ మరోసారి దానికి పూర్తి భిన్నమైన ప్రకటనను వెలువరించటం గమనించదగ్గ విషయం.

పైగా.. వెన్నెముక దిగువ భాగంలో నొప్పితో బాధపడుతున్న సందీప్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పటంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు హాకీ ఇండియా చెబుతోంది. దీంత వచ్చేనెల 6 నుంచి 13 వరకు జరిగే ఛాంపియన్స్ ఛాలెంజ్ టోర్నీ-1లో సందీప్ ఆడటం లేదని స్పష్టం చేసింది. అతడి స్థానంలో దివాకర్ రామ్‌ను జట్టులోకి తీసుకోవటమేగాక.. కెప్టెన్‌గా రాజ్‌పాల్ సింగ్ వ్యవహరిస్తాడని హెచ్.ఐ. వివరించింది.

ఇదిలా ఉంటే... చీఫ్ కోచ్ బ్రాసాపై సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో ఆటగాళ్లందరూ పూణేలో జరిగిన ఓ విందు సమావేశంలో కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో వారు బ్రాసాతో రాజీకి రావటమే మేలని భావించినట్లు సమాచారం. కోచ్ కూడా ఆటగాళ్లతో విభేదాలను పక్కనబెట్టి వివరంగా చర్చించారనీ... ఇకపై బ్రాసా శిక్షణా పద్ధతుల్లో తాము తలదూర్చబోమని ఆటగాళ్లు ఏకగ్రీవంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.