వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఏటీపీ ఫైనల్స్ : ఆండీ ముర్రే శుభారంభం (Sports | ATP World Tour Final | Britain | Andy Murray | Defending US Open Champion | Yuan Martin)
Feedback Print Bookmark and Share
 
Tennis
FILE
సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బ్రిటన్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. గ్రూప్-ఎ తొలి లీగ్ మ్యాచ్‌లో ముర్రే 6-3, 3-6, 6-2 స్కోరు తేడాతో అర్జెంటీనాకు చెందిన డిఫెండింగ్ యూఎస్ ఓపెన్ ఛాంపియన్, ప్రపంచ ఐదో ర్యాంకర్ యువాన్ మార్టిన్ డెల్ పొట్రోపై ఘన విజయం సాధించాడు.

రెండు గంటల పది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి పాయింట్ నుంచే ఆధిపత్యాన్ని కనబర్చాడు. రెండో గేమ్‌లో, నాలుగో గేమ్‌లో డెల్ పొట్రో సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌లను కాపాడుకుంటూ ముర్రే 5-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అదే ఊపుతో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో మాత్రం డెల పొట్రో పుంజుకుని.. పదునైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ముర్రే దూకుడుకు కళ్లెం వేశాడు.

ఇక నిర్ణాయక మూడో సెట్‌లో ముర్రే తన వైవిధ్యభరితమైన ఆటతీరుతో డెల్ పొట్రోపై పై చేయి సాధించి.. విజయం సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే... అంతకు మునుపు జరిగిన డబుల్స్ విభాగం తొలి మ్యాచ్‌లో పోలెండ్‌కు చెందిన మారియస్ ఫ్రిస్టెన్‌బర్గ్-మార్సిన్ మాట్కోవ్‌స్కీల జోడీ 6-4, 6-4 స్కోరుతో డిఫెండింగ్ ఛాంపియన్స్ డానియెల్ నెస్టర్-నెనాద్ జిమోనిచ్ జంటపై సంచలన విజయం నమోదు చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.