ఒలింపిక్ ఛాంపియన్ అభినవ్ బింద్రా ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. హేగ్‌లో జరుగుతున్న 33వ ఇంటర్‌షూట్ టోర్నమెంట్‌లో భాగంగా.. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బింద్రా స్వర్ణం సాధించాడు. శనివారం జరిగిన ఈ పోటీలో బింద్రా గురి 595 పాయింట్లను సంపాదించిపెట్టింది.
98, 100, 100, 100, 98, 99 స్కోరు సాధించిన ఛాంపియన్ షూటర్.. చివరి షాట్‌లో 103.7 పాయింట్లు సాధించాడు. దీంతో మొత్తం 698.7 స్కోరుతో ఈ టోర్నీలో రెండో బంగారు పతకాన్ని సాధించాడు.
ఇదిలా ఉంటే.. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ పోటీలలో సాధించిన స్కోరుతో, భారత ఏస్ ఆటగాడు అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్‌లో సాధించిన స్కోరుకు సమం చేశాడు. కాగా... 2008లో జరిగిన మెగా ఈవెంట్ తరువాత బింద్రా ఈ 596 పాయింట్ల స్కోరును సమం చేశాడు. దీంతో 596 స్కోరును బింద్రా సాధించటం ఇది మూడోసారి కావటం గమనార్హం.